కుమరం భీం: సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలపై మళ్లీ కొర్రీ పడింది. షెడ్యూల్‌ను శుక్రవారం ప్రకటిస్తారని అనుకుంటే ఎటూ తేలకుండా మళ్లీ సమావేశం వాయిదా పడింది. ఈ నెల 27న తిరిగి సమావేశమై చర్చిస్తామని ఎన్నికల రిట్నరింగ్ అధి కారి, డెప్యూటీ సీఎల్సీ శ్రీనివాస్ తెలిపారు. హైదరాబాద్‌లోని ఆయన కార్యాలయంలో ఎన్నికలపై సమావేశం జరిగింది. దీనికి 14 కార్మిక సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు.
ఉదయం నిర్వహించి న సమావేశంలో ఇంతకుముందు జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఎన్నికల షెడ్యూ ల్ విడుదల చేయాలని కార్మిక సంఘాల నేతలు రిటర్నింగ్ అధికారిని కోరారు. దీనిపై కార్మిక సంఘాల నేతలంతా తమ వాదనలు వినిపించారు. అ నంతరం సాయంత్రం మళ్లీ సమావేశం నిర్వహించా రు. దీనికి కంపెనీ నుంచి డైరెక్టర్ (పా) ఫైనాన్స్ బలరాం హాజరయ్యారు.
డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఉండనున్నందున ప్రస్తుతం గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని కలెక్టర్లు పేర్కొంటున్నారని సమావేశం దృష్టికి తీసుకువచ్చినట్లు బీఎంఎస్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య, హెచ్‌ఎమ్మెస్ అధ్యక్షుడు రియాజ్ అహ్మద్ తెలిపారు. ఇదే విషయమై కంపెనీ హైకోర్టుకు తిరిగి వెళ్లడం.. దీనిపై వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్‌లో పెట్టడంతో ఉన్న ఫలంగా షెడ్యూల్ ఇవ్వద్దని కంపెనీ కోరింది. దీంతో ఈ నెల 27న తిరిగి సమావేశం అవుదామని చెప్పి రిటర్నింగ్ అధికారి షెడ్యూ ల్ ఇవ్వకుండా సమావేశాన్ని వాయిదా వేశారు.
ఉత్తర్వులు జారీ..
గుర్తింపు సంఘం కాలపరిమితి ముగిసి ఎన్నికలు నిర్వహించడానికి జాప్యం జరుగుతున్నందున ఎన్నికలు నిర్వహించేదాకా అన్ని కార్మిక సంఘాలను సమానంగా గుర్తిస్తూ, ప్రాతినిధ్యం కల్పించాలని కార్మిక సంఘాల నేతలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఈ సమావేశంలోనే డైరెక్టర్ (పా) ఉత్తర్వుల కాపీని నేతలకు అందించారు.
ఎన్నికలు జరిగేదాకా 14 రిజిస్ట్రర్డ్ సంఘాల ప్రతినిధులను గుర్తింపు సంఘం నాయకులతో పాటు సమానంగా గనులు, ఏరియా, కంపెనీ స్థాయిలో జరిగే అధికారిక సమావేశాలు, చర్చలు, సంప్రదింపులు, కార్యక్రమాలకు ఆహ్వానించేలా ఏరియా జీఎంలకు డైరెక్టర్ ఉత్తర్వులు విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment