మేలుకో.. తెలుసుకో.. | - | Sakshi
Sakshi News home page

మేలుకో.. తెలుసుకో..

Published Sat, Mar 15 2025 12:16 AM | Last Updated on Sat, Mar 15 2025 12:16 AM

మేలుక

మేలుకో.. తెలుసుకో..

రెండేళ్ల క్రితం తాండూరు మండలం కాసిపేటకు చెందిన కస్తూరి శివకృష్ణ జిల్లా కేంద్రంలోని ఓ షోరూంలో బైక్‌ కొనుగోలు చేశాడు. ఆ బైక్‌ బ్యాటరీ రెండేళ్ల వారంటీ ఉండగా.. ఏడాదికే పాడైంది. దీనిపై షోరూం వాళ్లను అడిగితే కి.మీ. సాకు చూపిస్తూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దీంతో వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేసి షోరూంపై న్యాయపోరాటం చేస్తున్నాడు.

మంచిర్యాలకు చెందిన వెంకటేశ్‌ ఆన్‌లైన్‌ ఉత్పత్తుల కంపెనీపై ఫిర్యాదు చేశాడు. తనకు నాసిరకం వస్తువు అంటగట్టారని ఆ కంపెనీపై వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశాడు.

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: వినియోగదారులు నాణ్యమైన సేవలు పొందడంలో చాలా చోట్ల మోసపోతూనే ఉన్నారు. డబ్బులు చెల్లించి కంపెనీ ఉత్పత్తుల పేర్లు, బరువు, నాణ్యత, కల్తీ, ఉత్పత్తుల్లో మోసాలతోపాటు నిబంధనల మేరకు సర్వీస్‌ అంద డం లేదు. నిత్యం వినియోగించే ఉప్పు, పప్పు నుంచి తినే తిండే, తాగే నీళ్లు, విలువైన వస్తువులు మా ర్కెట్‌లో జరిగే ప్రతీ లావాదేవీలు, పౌరసేవల్లో మో సం, నిర్లక్ష్యం తప్పడం లేదు. వస్తువులు, సరుకులు కొనుగోలు చేసే సమయంలో అవగాహన లోపం, సేవలు పొందడం తెలియక చాలామంది వినియోగదారులు మోసపోతున్నారు. చాలా సంస్థలు నాసిరకం వస్తువులు, సరుకులు తయారు చేసి వినియోగదారులకు అంటగడుతున్నాయి. వినియోగ దారుల ప్రయోజనాలను పూర్తిగా తుంగలో తొక్కుతున్నాయి. దీనిని నివారించేందుకు కేంద్రం ప్ర త్యేక చట్టాన్ని తీసుకొచ్చింది. ఇదివరకు ఏ వస్తువునైనా షాపులోకి వెళ్లి నేరుగా కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం చాలా మంది ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తున్నారు. దీంతో మోసాలు సైతం మరింతగా పెరిగిపోతున్నాయి. హక్కులను మరింతగా రక్షించేందుకు కన్జూమర్‌ కమిషన్‌ కీలకపాత్ర పోషిస్తుంది. వేల కేసుల పరిష్కారానికి చొరవ చూపింది. నష్టపోయినదానికంటే అధికంగా పరిహారం అందించి బాధితులకు అండగా నిలిచింది. జిల్లాలో పలువురు విని యోగదారుల హక్కులపై పోరాటం చేస్తున్నారు. ఆయా సంబంధిత శాఖ అధికారులు నిత్యం తనిఖీలు చేస్తూ.. పర్యవేక్షించాల్సిన అవసరం ఉన్నా చూసీచూడనట్లుగా వదిలేయడంతో వినియోగదారులకు నష్టం జరుగుతోంది.

అవగాహనే శ్రీరామ రక్ష..

ప్రజల శ్రేయస్సు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు తీసుకొచ్చినా అవగాహన లేమితో అవి మెరుగైన ఫలితాలను సాధించడం లేదు. ప్ర స్తుత సాంకేతిక యుగంలోనూ ఎందరో వినియోగదారులకు తమ హక్కులపై సరైన చైతన్యం లేకుండా పోయింది. తమకు జరిగిన అన్యాయంపై కనీ సం ఫిర్యాదు సైతం చేయకుండా పోతున్నారు. న చ్చిన వస్తువుల సేవలు ఎంచుకోవడంతో పాటు వా టి నాణ్యత, పనితీరు గురించి తెలుసుకోవడం, అ భిప్రాయం తెలియజేయడం తదితర హక్కులు విని యోగదారులకు ఉంటాయి. వస్తుసేవల విషయంలో సమస్య తలెత్తితే వాటి విలువ ఆధారంగా జిల్లా, రాష్ట్ర, జాతీయ కమిషన్లను ఆశ్రయించవచ్చు.

వస్తువు చిన్నదైనా.. పెద్దదైనా.. మోసాలే

తయారీ, తూకం, నాణ్యత, ధరల్లో మాయాజాలం

సేవల్లో వినియోగదారులకు తప్పని తిప్పలు

నేడు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం

మంచిర్యాలకు చెందిన శ్రవణ్‌కుమార్‌ సినిమా థియేటర్‌లో నిబంధనలకు విరుద్ధంగా వాహనాల పార్కింగ్‌ ఫీజులు తీసుకుంటున్నారని వినియోగదారుల కోర్టులో ఫిర్యాదు చేశాడు. థియేటర్‌ లోపల తినుబండారాలు, శీతల పానీయాలను ఎమ్మార్పీ కన్నా ఎక్కువకు విక్రయిస్తున్నాడని ఫిర్యాదు చేశాడు. ఈ రెండూ ప్రస్తుతం విచారణలో ఉన్నాయి.

హక్కులు, బాధ్యతలు ఉన్నాయి

వినియోగదారులకు నాణ్యమైన సేవలు పొందే హక్కులు ఉన్నాయి. అదే సమయంలో బాధ్యతలు ఉన్నాయి. ప్రతీ ఒక్కరు తమ హక్కులు పొందేలా అవగాహన ఉండాలి. మా సంస్థ తరఫున మోసపోయిన వినియోగదారులకు మద్దతుగా నిలుస్తున్నాం.

–టి.చేతన సోనీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,

వినియోగదారుల హక్కుల సంస్థ

ప్రశ్నిస్తేనే న్యాయం

వినియోగదారుల సంరక్షణ చట్టం ప్రకారం తయారీ, నాణ్యత, తూకం, ప్రామాణిక ముద్ర, గడువు, ధర, జీఎస్టీ, తదితరాలు కచ్చితంగా ఉండాలి. చెల్లించిన ధరకు సేవలు పొందాలి. కానీ ఎక్కడైనా సేవల్లో అంతరాయం ఏర్పడితే కొందరే ప్రశ్నిస్తున్నారు. న్యాయం కోసం పోరాడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఆదిలాబాద్‌ జిల్లా కోర్టు ప్రాంగణంలోనే వినియోగదారుల వివాదాల పరిష్కారానికి కమిషన్‌ ఉంది. 2024లో మొత్తం 163 ఫిర్యాదులు రాగా, ఇందులో 29 పరిష్కరించగా, మరో 134 పెండింగ్‌లో ఉన్నాయి. కొన్ని కేసుల్లో ఆయా కంపెనీల, తయారీదారులపైనా జరిమానాలు విధించారు. ప్రస్తుతం వినియోగదారులు ఆన్‌లైన్‌లోనూ సెంటర్‌ అండర్‌ కన్జూమర్‌ కోఆర్డినేషన్‌ కౌన్సిల్‌ (సీసీసీ), ఈ జాగృతి వెబ్‌సైట్‌, హెల్ప్‌లైన్‌ 1915కు కాల్‌ చేయెచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
మేలుకో.. తెలుసుకో..1
1/2

మేలుకో.. తెలుసుకో..

మేలుకో.. తెలుసుకో..2
2/2

మేలుకో.. తెలుసుకో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement