
పెండింగ్ వేతనాలు చెల్లించాలని నిరసన
ఆసిఫాబాద్‌రూరల్: పెండింగ్ వేతనాలు చె ల్లించాలని జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట శుక్రవారం గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న వర్కర్లు సీపీఎం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. సీపీఎం జిల్లా కార్యదర్శి దినకర్ మాట్లాడుతూ గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న వర్కర్లకు ఏడు నెలలుగా వేతనాలు రావడం లేదన్నారు. హోలీ పండు గ రోజు సైతం సమ్మె చేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆశ్రమ పాఠశాల వర్కర్లు రాము, పద్మ, పుష్పలత తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment