సీఎం దిష్టిబొమ్మ దహనం
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, స్థానిక ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆదేశాల మేరకు శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. వారు మాట్లాడుతూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్వర్‌రెడ్డిని శాసనసభ సమావేశాల నుంచి సస్పెండ్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సస్పెన్షన్ వేటు వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు అలీబిన్ అహ్మద్, సంజీవ్‌కుమార్, పెంటు, అజయ్‌కుమార్, మల్లేశ్, నిసార్, రాజు, తుకారాం, శ్రీధర్, భీమేశ్, వినోద్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment