ఆసిఫాబాద్: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఎల్‌ఆర్‌ఎస్ రుసుం ఈ నెల 31లోగా చెల్లిస్తే 25 శాతం రాయితీ వర్తిస్తుందని జిల్లా పంచాయతీ అధికారి భిక్షపతిగౌడ్ అన్నారు. శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చే సిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దరఖాస్తుదారులకు వివరాలందించేందుకు కాల్‌సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. దరఖా స్తుదారులు lrs.telangana.gov.in ద్వారా వివరాలు తెలుసుకోవచ్చన్నారు. సందేహాలు నివృత్తి చేసుకునేందుకు కార్యాలయంలో సంప్రదించవచ్చన్నారు. సమావేశంలో జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.