● ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు
కౌటాల/బెజ్జూర్: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంగళవారం తెలంగాణ ధార్మిక, ధర్మాదాయ బిల్లుపై సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు మాట్లాడారు. బెజ్జూర్ మండల కేంద్రంలోని అతిపురాతన రంగనాయక ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. శేష పాన్పుపై నిద్రిస్తున్న శ్రీరంగనాయక స్వామి విగ్రహం మహా అద్భుతంగా ఉంటుందని తెలిపారు. ఈజ్‌గాం శివమల్లన్న ఆలయ కమిటీలో స్థానికులకు అవకాశం కల్పించాలన్నారు. బాసర ఆలయంలో భక్తులకు సౌకర్యాలు కల్పించాలని కోరారు. అలాగే ఆరోగ్య శ్రీ బకాయిలు ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని, కాళేశ్వరం జోన్‌లో కొత్త సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించాలని ఆయన కోరారు.