
● రేషన్‌కార్డు దారులకు ప్రభుత్వం తీపికబురు ● ఏప్రిల్ న
జిల్లాలో ప్రజాపంపిణీ వివరాలు
రేషన్ దుకాణాలు 314
అంత్యోదయ కార్డులు 12,948
తెల్లరేషన్ కార్డులు 1,24,336
ప్రతినెలా బియ్యం కోటా
2,968 మెట్రిక్ టన్నులు
క్యూఆర్ కోడ్‌తో కార్డులు
ప్రజాపాలన, మీసేవ కేంద్రాల ద్వారా జిల్లాలోని అర్హులు వేలాది కొత్త రేషన్ కార్డుల కో సం దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం వివి ధ స్థాయిల్లో వడబోత ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్రంలో దాదాపు పదేళ్ల తర్వాత కొ త్త రేషన్ కార్డులను క్యూఆర్ కోడ్‌తో స్మార్ట్ కా ర్డుల రూపంలో అందించేందుకు రాష్ట్రప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం రేషన్ కార్డులన్నీ మహిళల పేర్లతో ఉన్నాయి. స్మార్ట్‌కార్డులు కూడా మహిళల ఫొటోతో పంపిణీ చేయనున్నట్లు తెలుస్తోంది. కార్డుపై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయగానే.. ఇంట్లో ఎంతమంది సభ్యులు ఉన్నారు..? రాయితీ బియ్యం ఎన్ని కిలోలు..? తదితర అంశాలతో కూడిన సమాచారం కనిపిస్తుంది. సన్నబియ్యం పంపిణీని ప్రారంభించనున్న నేపథ్యంలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ వేగవంతం చేయాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు.
కౌటాల(సిర్పూర్): రాష్ట్రంలోని రేషన్‌కార్డు దారులకు ప్రభుత్వం ఉగాది కానుకగా సన్నబియ్యం పంపిణీ చేయనుంది. ప్రస్తుతం రేషన్ దుకాణాల ద్వారా దొడ్డు బియ్యం అందిస్తుండగా.. ఏప్రిల్ 1 నుంచి సన్నబియ్యం అందించనున్నారు. ఉగాది సందర్భంగా ఈ నెల 30న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇప్పటికే అవసరమైన బియ్యం కోటా జిల్లాకు చేరింది. జిల్లాలోని 15 మండలాల్లో 335 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రజలకు బియ్యం పంపిణీ చేసేందుకు 314 రేషన్ షాపులు ఏర్పాటు చేశారు. మొత్తం 1,37,284 ఆహార భద్రత కార్డులు ఉండగా, ఇందులో అంత్యోదయ కార్డులు 12,948, తెల్లరేషన్ కార్డులు 1,24,336 ఉన్నాయి. మరో 21 అన్నపూర్ణ కార్డులు ఉన్నాయి. వీరికి ప్రతినెలా 2,968 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఆహార భద్రత కార్డుదారులకు ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పన బియ్యం, అంత్యోదయ కార్డులదారులకు 35 కిలోలు, అన్నపూర్ణ కార్డుదారులకు 10 కిలోల చొప్పున సరఫరా చేస్తున్నారు. ప్రతినెలా 1 నుంచి 15 వరకు బియ్యం పంపిణీ కొనసాగుతుంది.
పెరిగిన సన్నాల సాగు
గత ప్రభుత్వం సైతం పేదలకు సన్నబియ్యం సరఫరా చేసే ప్రయత్నం చేసింది. రెండు, మూడు నెలలపాటు అరకొర సరఫరా చేయగా.. అందులో నూకలు, తౌడు రావడంపై విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత యథావిధిగా దొడ్డు బియ్యమే పంపిణీ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సన్నబియ్యం పంపిణీకి కసరత్తు ప్రారంభించింది. అయితే సరిపడా సన్నబియ్యం నిల్వలు అందుబాటులో లేకపోవడంతో వాయిదా పడింది. అనంతరం రాష్ట్రంలో సన్నాల సాగు పెంచేందుకు సర్కారు ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా సన్నవడ్లు పండించిన రైతులకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ప్రకటించింది. దీంతో వానాకాలం సీజన్‌లో గణనీయంగా సన్నవడ్ల సాగు పెరిగింది. కొనుగోలు కేంద్రాల ద్వారా సన్నవడ్లను సేకరించారు. ప్రస్తుతం లబ్ధిదారులకు సరిపడా బియ్యం అందుబాటులో ఉండడంతో ఏప్రిల్ 1 నుంచి పంపిణీ ప్రారంభిస్తామని జిల్లా పౌర సరఫరా శాఖ అధికారులు తెలిపారు.
పక్కదారి పట్టకుండా..
జిల్లాలో చాలామంది సన్నబియ్యమే తింటున్నారు. దీంతో రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేసే దొడ్డుబియ్యం అక్రమార్కులకు ఆదాయ వనరుగా మారింది. జిల్లా సరిహద్దున మహారాష్ట్ర ఉండటంతో రోడ్డు, రైలు మార్గం ద్వారా రేషన్ బియ్యం తరలిపోతోంది. కొందరు డీలర్లకే బియ్యం అమ్ముకుని బదులుగా డబ్బులు, నిత్యావసర వస్తువులు తీసుకుంటున్నారు. నేరుగా డీలర్లే పెద్దమొత్తంలో రేషన్ బియ్యం సేకరించి దళారులకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దళారుల నుంచి కొందరు రైస్ మిల్లర్లు మళ్లీ రూ.26కు కేజీ చొప్పున కొని.. ఆ బియ్యాన్ని తిరిగి ప్రభుత్వానికి(ఎఫ్‌సీఐ)కి అప్పగించేవారు. మరికొందరు మిల్లర్లు సన్నబియ్యంగా మార్చి మార్కెట్‌లో విక్రయిస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. లక్ష్యం నీరుగారుతుండటంపై ప్రభుత్వం దృష్టి సారించింది. రేషన్ దుకాణాల్లో ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీకి ఏర్పాట్లు చేస్తోంది. సన్నబియ్యం పంపిణీతో అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడే అవకాశం ఉంది.

● రేషన్‌కార్డు దారులకు ప్రభుత్వం తీపికబురు ● ఏప్రిల్ న