
‘ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ విఫలం’
బెజ్జూర్(సిర్పూర్): రాష్ట్రంలో ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ విఫలమైందని బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. బెజ్జూర్ మండలంలో బుధవారం విస్తృతంగా పర్యటించారు. రాష్ట్ర ప్రజల కష్టాలు తీరాలన్నా.. రైతుల కన్నీళ్లు ఆగాలన్నా కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చినా ఇప్పటికీ ఇవ్వడం లేదన్నారు. మహిళలకు నెలకు రూ.2500, రైతు రుణమాఫీ, రైతు భరోసా వంటి హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. మండలంలోని గబ్బాయి, పాపన్‌పేట్, తలాయి, సోమిని, మొగవెల్లి, బారెగూడ, ముంజంపల్లి గ్రామాల్లో పర్యటించారు. రైతులు, మహిళల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కుకుడ గ్రామంలోని పలువురు యువకులకు కండువా కప్పి బీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ లెండుగురె శ్యాంరావు, నాయకులు కాశిపాక రాజు, సారయ్య, దుర్గం తిరుపతి, ఖాజా, షాముద్దిన్, ఆత్రం హరీశ్ తదితరులు పాల్గొన్నారు.