ఆసిఫాబాద్‌అర్బన్: రిజర్వేషన్ల అమలుకు ఏప్రిల్ 2న ఢిల్లీలో బీసీల పోరుగర్జన కార్యక్ర మం నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రూప్‌నర్ రమేశ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని బీసీ సంఘం కార్యాలయంలో శుక్రవారం పోరుగర్జన పోస్టర్ ఆవి ష్కరించారు. ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్ర భుత్వం దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలన్నారు. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ 42శాతానికి పెంచుతూ అసెంబ్లీలో చేసిన చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు లహుకుమార్, వైరాగడే మారుతిపటేల్, నాగోసె శంకర్, ఎసయ్య, రాజుపటేల్ తదితరులు పాల్గొన్నారు.