
లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు అందజేత
ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని 114 మందికి ఒక్కొక్కరికి రూ.1,00,116 చొప్పున చెక్కులు అందజేశా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ.. పేదింటి ఆడబిడ్డల కోసం గత సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి పథకం ప్రవేశ పెట్టారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో అదనంగా తులం బంగారం ఇస్తామని ప్రకటించి విస్మరించిందని విమర్శించారు. తహసీల్దార్ రోహిత్ దేశ్‌పాండే, బీఆర్‌ఎస్ నాయకులు అలీబిన్ అహ్మద్, రవీందర్, భీమేశ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.