
పంచకట్టుతోనే పాఠాలు
మంచిర్యాలఅర్బన్: మంచిర్యాలకు చెందిన అవిశ్రాంత తెలుగు అధ్యాపకుడు తుమ్మల మల్లారెడ్డి తెలుగుదనం ఉట్టిపడేలా పంచెకట్టు ధరిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో డైట్ కళాశాలలో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తూ 2000 సంవత్సరంలో ఉద్యోగ విరమణ పొందారు. అప్పటి నుంచి ఇంట్లో కూర్చోవడం ఇష్టం లేక తనుకున్న జ్ఞానాన్ని విద్యార్థులకు అందించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. తెలంగాణలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, శ్రీకాకుళం తదితర ప్రాంతాలకు వెళ్లి విద్య–నీతి–విలువలపై పాఠాలు బోధిస్తున్నారు. తెలుగు భాషా పరిరక్షణలో తనవంతు పాత్ర పోషిస్తున్నారు. ఈతరం మాస్టార్లు కూడా పంచెకట్టు సంప్రదాయం కొనసాగించాలని సూచిస్తున్నాడు.