ఇటు కళకళ.. అటు వెలవెల
మచిలీపట్నంటౌన్: బర్డ్‌ఫ్లూ ప్రభావం మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపింది. ఆదివారం వచ్చిందంటే నగరంలోని అన్ని వర్గాల ప్రజలు మాంసాహారాన్ని భుజించేందుకు ఇష్టపడతారు. ఎక్కువగా చికెన్నే తింటుంటారు. అయితే ఈ ఆదివారం మాత్రం బర్డ్‌ఫ్లూ ప్రభావం ప్రచారంతో ప్రజలు చికెన్‌ను తినేందుకు అయిష్టత చూపినట్లు స్పష్టంగా కనిపించింది. నగరంలోని చికెన్ షాపులు కొనుగోలుదారులు లేక వెలవెలబోయాయి. మటన్, చేపల దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి.
చేపల మార్కెట్ కిటకిట..
బందరలోని మోకా భాస్కరావు చేపల మార్కెట్ కొనుగోలుదారులతో కిటకిటలాడింది. కేజీ చికెన్ ధర రూ. 170 ఉంది. అయితే చేపలు, మటన్ ధరలకు రెక్కలొచ్చాయి. నగరంలో కిలో మటన్‌ను సాధారణంగా రూ. 800కు విక్రయిస్తుండగా ఆదివారం మాత్రం ఇది రూ.900 నుంచి రూ. వెయ్యి వరకూ విక్రయించారు. చేపలు రాగండి రకం కిలో రూ.170, బొచ్చ రకం కిలో రూ. 220కు విక్రయించారు. అధిక ధర పలికినా వీటిని కొనుగోలు చేసేందుకే ప్రజలు మొగ్గు చూపారు. ఇవి కూడా మధ్యాహ్నం 12 గంటల కల్లా అన్ని దుకాణాల్లోనూ నిండుకోవటం గమనార్హం.
చికెన్ వైపు చూడని మాంసం ప్రియులు
మటన్, చేపలు కొనుగోలుకు మొగ్గు
ఇటు కళకళ.. అటు వెలవెల
Comments
Please login to add a commentAdd a comment