నాటకానికి పూర్వ వైభవం తెద్దాం
విజయవాడ కల్చరల్: గాంధీనగర్‌లోని హనుమంతరాయ గ్రంథాలయంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న జాతీయ సాంఘిక నాటికల పోటీలు ఆదివారం ముగిశాయి. యూత్ స్పోర్ట్స్ కల్చరల్ ఫోరం, కళావిపంచి, శ్రీ కృష్ణా తెలుగు థియేటర్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో నిశ్శబ్దం.. నీ ఖరీదు ఎంత, జనరల్ బోగీ, కిడ్నాప్ వంటి నాటికలు వీక్షకులను ఆలోచింపజేశాయి. ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాల కృష్ణ మాట్లాడుతూ తెలుగు నాటకానికి పూర్వవైభవం తీసుకురావాలన్నారు. శ్రీ కృష్ణ తెలుగు థియేటర్స్ అధ్యక్షుడు కేవీకే రంగనాథన్, ఉపాధ్యక్షుడు నడుంపల్లి వేంకటేశ్వర్లు, కోశాధికారి చంద్రశేఖర్ సంస్థ లక్ష్యాలను వివరించారు. కార్యక్రమంలో భాగంగా సమాచార శాఖ ఉప సంచాలకుడు కిరణ్‌కుమార్ పోతుల, విద్యావేత్త బెండపూడి మురళీధర్, వివిధ రంగాలకు చెందిన వజ్ఞా మధుసూదనరావు, అమరేంద్ర బోల్లంపల్లి, అంకం భుజంగరావు, వైఎస్‌వీఎస్ శ్రీనివాస్, జీవీజీ శంకర్, హసన్ షేక్ విశిష్ట సేవా పురస్కారాలను ప్రదానం చేశారు.
నేడు హ్యాండ్‌బాల్
జిల్లా జట్లు ఎంపిక
విజయవాడస్పోర్ట్స్: రాష్ట్ర స్థాయి సీనియర్ మహిళల, జూనియర్ బాలుర హ్యాండ్‌బాల్ పోటీలకు ప్రాతినిధ్యం వహించే ఉమ్మడి కృష్ణాజిల్లా జట్లను విజయవాడ వన్‌టౌన్‌లోని కేబీఎన్ కాలేజీలో సోమవారం ఎంపిక చేస్తున్నట్లు కృష్ణాజిల్లా హ్యాండ్‌బాల్ సంఘం కార్యదర్శి ఎన్.వంశీకృష్ణప్రసాద్ తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనాలనే ఆసక్తి ఉన్నక్రీడాకారులు సాయంత్రం నాలుగు గంటలకు ఎంపిక ప్రాంగణంలో సంప్రదించాలని సూచించారు. ఎంపికై న జిల్లా జట్లు ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు కర్నూలులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటాయన్నారు.
నాటక అకాడమీ చైర్మన్ గోపాల కృష్ణ
Comments
Please login to add a commentAdd a comment