ఒకే రాత్రి నాలుగు ఇళ్లలో చోరీ
కంచికచర్ల: ఒకే రోజు రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నాలుగు ఇళ్లలోకి చొరబడి దొంగతనం చేశారు. ఈ ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. రెక్కీ నిర్వహించి, ఎవరూ లేని ఇళ్లను ముందుగా గుర్తించి చోరీలకు పాల్పడ్డారు. మండలంలోని గొట్టుముక్కల గ్రామంలో సోమవారం రాత్రి సమయంలో నాలుగు ఇళ్లలో దొంగలు పడి విలువైన వస్తువులు, బంగారు ఆభరణాలు, నగదు దోచుకెళ్లారు. గ్రామానికి చెందిన గోగినేని నాగరాణి వారం క్రితం తన కుమార్తెలు ఉంటున్న విజయవాడకు వెళ్లారు. ఆమె ఇంట్లోకి జొరబడిన దొంగలు రూ.50 వేల నగదు, ఐదు తులాల బంగారు నగలు దోచుకెళ్లారు. గోగి నేని జోగయ్య సోమ వారం గుంటూరు వెళ్లగా అతని ఇంటి తాళాన్ని దొంగలు పగలగొట్టారు. అయితే కుక్క అరవటంతో దొంగలు వేరే ఇంటికి వెళ్లారు. నంది గామలో ఉంటున్న చాగంటి దేవేంద్ర ఇంటిలో రూ.20 వేల బంగారు ఆభరణాలను దొంగలు చోరీ చేశారు. గోగినేని వెంకట్రావు నాలుగు రోజుల క్రితం హైద్రాబాద్ వెళ్లగా, అతని ఇంటిలోకి చొరబడిన దొంగలు కొంత నగదు, బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఒకే రాత్రి నాలుగు ఇళ్లలో చోరీ
Comments
Please login to add a commentAdd a comment