పాలవ్యాన్ ఢీకొని సైక్లిస్టు మృతి
గుడివాడరూరల్: పాల వ్యాన్ ఢీకొని సైక్లిస్టు మృతి చెందిన ఘటన సోమవారం రాత్రి జరిగింది. మల్లాయపాలెం పరిధి లోని టిడ్కో సముదాయంలో నివసించే అబ్దుల్ బాజానీ (గనీ) (54) సోమవారం రాత్రి గుడివాడ వచ్చి తిరిగి ఇంటికి బయలుదేరాడు. బస్టాండ్ సమీపంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన పాల వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాజానీని స్థానికులు హుటాహుటిన 108లో గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే అతను అప్పటికే మృతిచెందాడని వైద్యులు నిర్ధారించారు. మృతుడికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ప్రమాదానికి కారణమైన వ్యాన్ డ్రైవర్‌ను గుడివాడ టూటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాజానీ మృతదేహానికి మంగళవారం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుని మూడో కుమార్తె సయ్యద్ షహనాజ ఫిర్యాదు మేరకు టూటౌన్ ఏఎస్‌ఐ జయబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment