మత్స్యకారుల సంక్షేమాభివృద్ధికి కృషి చేయండి
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో ప్రధానమంత్రి మత్స్యసంపద యోజన కింద అమలవుతున్న వివిధ రకాల పథకాల రాయితీలను మత్స్యకారులకు అందించి వారి సంక్షేమాభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో బుధవారం సాయంత్రం మత్స్యశాఖ అధికారులతో పథకాల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పథకాలపై మత్స్యకారులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. బోట్లు, వలలు, మోటారు ఇంజిన్లు తదితర యూనిట్ల మంజూరుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కొంతమంది లబ్ధిదారులకు పలు రకాల యూనిట్లకు సంబంధించి సబ్సిడీ రాయితీలు ఇంకా రావాల్సి ఉందని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా ఈ విషయాలను పై అధికారులకు తెలియజేసేందుకు లేఖలు సమర్పించాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా ఆయా యూనిట్ల మంజూరుకు పూర్తిస్థాయిలో ఆర్థిక చేయూతనిచ్చేలా కృషి చేయాలన్నారు. సమావేశంలో జిల్లా మత్స్యశాఖ అధికారి నాగబాబు, పలువురు మత్స్యశాఖ అధికారులు పాల్గొన్నారు.
స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయం
కోనేరుసెంటర్: పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా సముద్ర తీరంలో పరిశుభ్రత కోసం దక్షిణ కొరియా కేంద్రంగా పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ ఏఎస్‌ఈజెడ్ కృషి అభినంద నీయమని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. మచిలీ పట్నం మంగినపూడి బీచ్ ఒడ్డున ఏఎస్‌ఈజెడ్ సంస్థ ప్రతినిధులు వలంటీర్లతో కలిసి మంగినపూడి బీచ్ తీరంలో పరిశుభ్రత కార్యక్రమం చేపట్టారు. సముద్ర తీరంలో పేరుకుపోయిన ప్లాస్టిక్ తదితర వ్యర్థాలను ఏరి శుభ్రం చేశారు. అనంతరం సంస్థ ప్రతినిధులు కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్‌ను కలిసి సంస్థ లక్ష్యాలను వివరించారు. ప్రపంచవ్యాప్తంగా నదులు, సముద్ర తీరాలలో కాలుష్య రహితానికి సంస్థ చేస్తున్న కృషిని కలెక్టర్‌కు వివరించారు. పర్యాటకశాఖ జిల్లా అధికారి జి.రామలక్ష్మణరావు, సంస్థ ప్రతినిధులు విలియం, ప్రేమ్ కుమార్, దక్షిణ కొరియా విశ్వవిద్యాలయ విద్యార్థులు కలెక్టర్‌ను కలిసిన వారిలో ఉన్నారు.
కలెక్టర్ బాలాజీ
మత్స్యకారుల సంక్షేమాభివృద్ధికి కృషి చేయండి
Comments
Please login to add a commentAdd a comment