టమాటాను రైతుబజారులోనే విక్రయించండి
మార్కెటింగ్ ఏడీ నిత్యానందం
మచిలీపట్నంటౌన్: టమాటాను పండించే రైతులు వాటిని బహిరంగ మార్కెట్‌లో కాకుండా రైతు బజార్‌లోనే విక్రయించుకోవాలని మార్కెటింగ్ శాఖ ఏడీ నిత్యానందం సూచించారు. రైతు బజారును ఆయన గురువారం ఆకస్మికంగా పరిశీలించారు. టమాటా దిగుబడి ఎక్కువగా రావటంతో ధర కిలో రూ.13 ఉన్నందున బహిరంగ మార్కెట్‌లో తక్కువ ధర వస్తుందని, అందువల్ల రైతు బజారులో స్వయంగా విక్రయిస్తే లాభం వస్తుందన్నారు. బయట మార్కెట్‌లో దళారులకు విక్రయించి నష్ట పోవద్దన్నారు. రైతు బజార్‌లో దుకాణాల్లో కాటాలు సక్రమంగా ఉన్నదీ లేనిదీ ఆయన పరిశీలించారు. రైతు బజార్లో నడవడానికి కూడా లేకుండా దుకాణాలను అస్తవ్యస్తంగా నిర్వహిస్తున్న రైతుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యటనలో ఆయన వెంట రైతు బజారు ఎస్టేట్ అధికారి ఎల్. బలిచక్రవర్తి, పకీర్, ఆనంద్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment