మైలవరం: ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు మండలం చీమలపాడు అంగన్‌వాడీ కేంద్రంలో పంపిణీ చేసిన కోడిగుడ్లు తిన్న చిన్నారులు 9మంది అస్వస్థతకు గురి కాగా మైలవరం ప్రభుత్వ ఆసుపత్రిలో గత రెండు రోజులుగా చికిత్స పొందుతున్నారు. వీరిలో ఆరుగురు చిన్నారులు పూర్తిగా కోలుకోవడంతో వారిని డిస్‌చార్జి చేసినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జయ ప్రకాశ్ శుక్రవారం తెలిపారు. మిగతా ముగ్గురి ఆరోగ్యం సంతృప్తిగానే ఉందని,అయితే కొంచెం నీరసంగా ఉండటంతో వారిని ఆసుపత్రిలోనే ఉంచి వైద్యం చేస్తున్నట్లు తెలిపారు. ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ జి.శ్రీలక్ష్మి, ఫుడ్ ఇన్‌స్పెక్టర్, డీసీహెచ్ నాయక్, ఆరోగ్య శాఖ సిబ్బంది, తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి చిన్నారుల ఆరోగ్యం గురించి వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. చిన్నారుల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్య సిబ్బందికి సూచించారు.
బాలల అస్వస్థతపై అధికారుల విచారణ
తిరువూరు: ఎ.కొండూరు మండలం పెదతండా అంగన్‌వాడీ కేంద్రంలో ఐదుగురు చిన్నారులు అస్వస్థతకు గురైన సంఘటనపై ఐసీడీఎస్ అధికారులు విచారణ చేపట్టారు. సీ్త్ర శిశు సంక్షేమ శాఖ జిల్లా పీడీ శ్రీలక్ష్మి గురువారం రాత్రి మైలవరం ప్రభుత్వాసుపత్రిలో పిల్లల తల్లిదండ్రులను, పెద తండా అంగన్‌వాడీ కేంద్ర సిబ్బందిని విచారించారు. తిరువూరు ఐసీడీఎస్ సీడీపీవో సత్యవతి పెదతండా వాసులను, పిల్లల తల్లిదండ్రులను కలిసి చిన్నారులు అస్వస్థతకు గురైన విషయంలో వారి అభిప్రాయాలు సేకరించారు.
Comments
Please login to add a commentAdd a comment