5 వేల మొక్కల విక్రయం
సాంబశివరావు నర్సరీలో అరబికం, ఉబేసం, నోవా టాంజానియా, క్రిస్పం, స్వాజికం, సోమాలియన్స్, మల్టీఫ్లోరం, సోకోట్రానమ్, బహుమీనియం, తాయ్ సోకోట్రానమ్ వంటి రకాలు, ఉప రకాల మొక్కలు ఉన్నాయి. మూడు నెలల నుంచి పదేళ్లవయసు మొక్కలు కొలువుదీరాయి. ప్రత్యేకంగా సృష్టించిన రకాల్లో టవర్‌ఫామ్, రూట్ ట్రెయిన్‌ప్లాంట్, అన కొండ వంటివి ఉన్నాయి. నాలుగేళ్లలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ఢిల్లీ, మేఘాలయ ప్రాంతాలు మినహా దాదాపు మిగిలిన అన్ని రాష్ట్రాలకు ఐదు వేలకు పైగా మొక్కలను ఎగుమతి చేశారు. తన SambaAdeniums అనే ఇస్టాగ్రామ్, ఫేస్‌బుక్ అకౌంట్ల ద్వారా ఆర్డర్లు సేకరించి ఈ మొక్కలు సరఫరా చేస్తున్నట్లు సాంబశివరావు తెలిపారు. రూ.150 నుంచి రూ.25 వేల విలువైన, అరుదైన మొక్కలు తన వద్ద ఉన్నట్లు చెప్పారు. ప్రతి నెలా రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకూ మొక్కల విక్రయం ద్వారా తనకు ఆదాయం వస్తోందని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment