ఆకట్టుకుంటున్న
నాగాయలంకలో తలశిల వెంకట నరసింహారావు (తాతయ్య) ఇంటి పెరటిలో రుద్రాక్ష వృక్షం ఏపుగా పెరుగుతోంది. చెట్టు నిండా కాయలతో ఆకట్టుకుంటోంది. శివుడి నయనాల నుంచి జాలువారిన నీటి బిందువులే రుద్రాక్షలుగా ఆవిర్భవించాయని పురాణాలు పేర్కొంటున్నాయి. సముద్ర తీరప్రాంతమైన నాగాయలంక గ్రామంలో ఎనిమిదేళ్ల క్రితం తాతయ్య రుద్రాక్ష మొక్క నాటారు. స్వచ్ఛ నాగాయలంక సొసైటీలో సేవా కార్యకర్తగా పనిచేస్తున్న తరుణంలో 2016లో దేవాలయాల ప్రాంగణాల్లో నాటేందుకు కొన్ని రుద్రాక్ష మొక్కలు తెప్పించారు. తన పెరటిలో, స్థానిక శివాలయ ప్రాంగణంలో ఒక్కొక్క రుద్రాక్ష మొక్క నాటారు. గత ఏడాది కొంత మేరకు కాపు వచ్చింది. ఈ ఏడాది ప్రస్తుతం వందల సంఖ్యలో రుద్రాక్షలతో చెట్టు ఆకట్టుకుంటోంది. చెట్టు ప్రధాన కాండం మూడు కొమ్మలుగా త్రిశూలాకృతిలో విస్తరించి చెట్టు అంతా కాయలు కాయడం తమ అదృష్టమని, త్రిమూర్తుల ఆవతారంగా భావించే త్రిముఖ రుద్రాక్షలే అధికశాతం వస్తుండటం విశేషమని తాతయ్య కుటుంబం సంబరపడుతోంది. అడిగిన వారికి రుద్రాక్షలను ఉచితంగా అందజేస్తోంది.
– నాగాయలంక
రుద్రాక్ష వృక్షం
రుద్రాక్ష వృక్షం