కోనేరుసెంటర్(మచిలీపట్నం): మహిళల రక్షణకు భంగం కలిగించే వారు ఎవరైనా సరే చట్టం దృష్టిలో శిక్షార్హులేనని జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు పేర్కొన్నారు. ‘సమాజంలో మహిళలు, చిన్నారులుపై జరుగుతున్న దాడులు – చట్టాలు’పై జిల్లా పోలీసు కార్యాలయంలోని స్పందన సమావేశపుహాలులో గురువారం అవగాహన సదస్సు జరిగింది. న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు మాట్లాడుతూ.. చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడే వారికి పోక్సో చట్టం ప్రకారం జీవిత ఖైదు తప్ప దని హెచ్చరించారు. స్పెషల్ జ్యుడీషి యల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ప్రొహిబిషన్, ఎకై ్సజ్ కోర్టు జడ్జి మేరీ మాట్లాడుతూ.. చిన్నారులు, విద్యార్థినులకు వేధింపులు ఎదురైతే ధైర్యంగా తల్లిదండ్రు లకు చెప్పి పోలీసుల రక్షణ పొందవచ్చన్నారు. దిశ సీఐ వాస వెంకటేశ్వరరావు, న్యాయవాదులు అజ్మతున్నీసా, ముసలయ్య పాల్గొన్నారు.