
ఉద్యోగవిరమణ చేసిన సిబ్బందికి సత్కారం
కోనేరుసెంటర్: ఆరోగ్యమే మహాభాగ్యమని సంపూర్ణ ఆరోగ్యంతో ఉద్యోగ విరమణ పొందిన సిబ్బంది తమ శేష జీవితాన్ని సంతోషంతో పాటు ఆరోగ్యవంతంగా గడిపేలా వారిని ఆశీర్వదించాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు తెలిపారు. జిల్లాలోని వివిధ పోలీస్‌స్టేషన్‌లలో విధులు నిర్వర్తిస్తూ ఉద్యోగవిరమణ పొందిన ఎస్‌ఐ ఏకే జిలాని (ఎస్‌ఐ–777), ఏఎస్‌ఐ వీఎస్‌ఎస్ ప్రసాద్ (ఏఎస్‌ఐ–935)లను సోమవారం ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఆయన మాట్లాడుతూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉద్యోగ విరమణ పొందటమనేది అదృష్టంగా భావించాలన్నారు. ఉద్యోగవిరమణ పొందిన ప్రతి ఒక్కరూ శేష జీవితాన్ని కుటుంబసభ్యులతో సంతోషంగా గడిపేందుకు ప్రయత్నించాలన్నారు.