పెనమలూరు: యనమలకుదురులో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. పెనమలూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యనమలకుదురు పుట్టరోడ్డుకు చెందిన గడ్డం పెదనాంచారయ్య(38) భార్య వాణి, ఇద్దరు పిల్లలతో ఉంటున్నారు. భర్త పెయింటింగ్ పనులు చేస్తుండగా, భార్య విజయవాడలో ప్రైవేటు హోటల్‌లో పని చేస్తుంది.
అయితే భర్త తరచుగా పని మానివేస్తుండటంతో భార్య మందలించింది. కాగా ఆదివారం భార్య పనికి వెళ్లగా భర్త ఒక్కడే ఇంట్లో ఉన్నాడు. కాగా సాయంత్రం భార్య వాణి ఇంటికి వచ్చి తులుపులు కొట్టగా భర్త ఇంటి తలుపులు తెరవలేదు. దీంతో వాణి ఇరుగు పొరుగువారిని పిలిచి బలవంతంగా ఇంటి తలుపులు తెరిచి చూడగా నాంచారయ్య సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని మృతి చెంది ఉన్నాడు. పని లేకపోవడం కారణంగా మనస్తాపంతో మృతి చెందాడని భార్య ఫోలీసులకు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేశారు.