
మంగినపూడి బీచ్ అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక
రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర
మచిలీపట్నంరూరల్: మంగినపూడి బీచ్‌ను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించామని ఎకై ్సజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. గురువారం రాత్రి మంత్రి రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, కలెక్టర్ డీకే బాలాజీలతో కలిసి మంగినపూడి బీచ్‌ను పరిశీలించారు. అక్కడి ఆహ్లాదకర వాతావరణాన్ని గమనించిన ముఖ్య కార్యదర్శి బీచ్ అభివృద్ధికి ఎంతో మంచి అవకాశాలు ఉన్నాయన్నారు. అనంతరం మంత్రి రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని అమరావతికి, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు, భీమవరం, రేపల్లె, గుంటూరు తదితర ప్రాంతాలకు మంగినపూడి బీచ్ దగ్గరగా ఉందన్నారు. ఈ బీచ్ సురక్షితమైనదే కాకుండా ఇక్కడ 200 ఎకరాల భూమి కూడా అందుబాటులో ఉందని, అందులో ఇప్పటికే 150 ఎకరాల భూమిని గుర్తించామన్నారు. మిగిలిన 50 ఎకరాల భూమిని కూడా గుర్తించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు.
పీపీపీ పద్ధతిలో అభివృద్ధి..
పీపీపీ పద్ధతిలో స్వదేశీ దర్శన్ పథకం కింద బీచ్‌లో రిసార్టులు, హోటళ్లు తదితర అభివృద్ధి పనులు చేసేందుకు రూ. 108కోట్ల నుంచి రూ. 150 కోట్ల వ్యయం అయ్యే అవకాశం ఉందని మంత్రి చెప్పారు. ఆ మేరకు సమగ్ర ప్రణాళికతో ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పంపేందుకు సిద్ధం చేశామన్నారు. మే 15వ తేదీ నుంచి బీచ్ ఉత్సవాలను నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నానున్నారు. కియా కింగ్, బీచ్ కబడ్డీ జాతీయ క్రీడలను కూడా ఈసారి మంగినపూడి బీచ్ లో నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిందన్నారు. పర్యాటకశాఖ ప్రాంతీయ సంచాలకులు వై.వి.ప్రసన్నలక్ష్మి, జిల్లా పర్యాటక అధికారి రామ్ లక్ష్మణ్, ఆర్డీవో స్వాతి తదితరులు పాల్గొన్నారు.