
తిరుపతి–మచిలీపట్నం మధ్య వేసవి ప్రత్యేక రైళ్లు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): వేసవి సీజన్‌లో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా తిరుపతి–మచిలీపట్నం మధ్య ప్రత్యేక వారాంతపు రైళ్లు నడపనున్నట్లు విజయవాడ డివిజన్ పీఆర్‌ఓ నుస్రత్ మండ్రూప్కర్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. తిరుపతి–మచిలీపట్నం ప్రత్యేక రైలు (07121) ఈ నెల 13 నుంచి మే 25 వరకు ప్రతి ఆదివారం రాత్రి 10.20 గంటలకు తిరుపతిలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 7.30 గంటలకు మచిలీపట్నం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07122) ఈ నెల 14 నుంచి మే 26 వరకు ప్రతి సోమవారం సాయంత్రం 5.40 గంటలకు మచిలీపట్నంలో బయలుదేరి, మరుసటి రోజు తెల్లవారుజమున 3.20 గంటలకు తిరుపతి చేరుతుంది. రెండు మార్గాలలో ఈ రైళ్లు రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, గుడివాడ, పెడన స్టేషన్లలో ఆగుతాయి.