బనగానపల్లెరూరల్: యనకండ్ల గ్రామంలో ఈ నెల 20వ తేదీన భార్య మాధవిని చంపిన భర్త కొరపాటి నాగప్రసాద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక పోలీసు స్టేషన్‌లో మంగళవారం నిందితుడి వివరాలను డోన్ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి మీడియాకు వివరించారు. యనకండ్లకు చెందిన నాగప్రసాద్ క్లీనర్‌గా పని చేస్తుండగా అతని భార్య మాధవి కూలీ పనులకు వెళ్లేది. భార్య తరచూ ఇతరులతో ఫోన్‌లో మాట్లాడుతుండటంతో వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్లు అనుమానించాడు. ఈ విషయంలో ఆమెతో ఘర్షణ పడుతుండటంతో హత్యకు వారం రోజుల క్రితం భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పెద్దల సమక్షంలో ఇద్దరూ రాజీ కావడంతో కేసు ఉపసంహరించుకుంది. అయితే ఆమె ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఈనెల 20వ తేదీ రాత్రి రోకలిబండతో తలపై బలంగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అప్పటి నుంచి పరారీలో ఉన్న నిందితుడు మంగళవారం గ్రామ వీఆర్‌వో ఎదుట భార్యను తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. సీఐ మల్లికార్జునగుప్తా, ఎస్‌ఐలు నవీన్‌బాబు, వీరాంజనేయులు మరోసారి నిందితుడిని విచారించి కేసు నమోదు చేశారు. కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment