పోలకల్ విద్యార్థుల ప్రతిభ
సి.బెళగల్: ఇటీవల తెలంగాణ సారస్వత పరిషత్ నిర్వహించిన పలు పోటీల్లో మండలంలోని పోలకల్ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారని హెచ్‌ఎం రమ తెలిపారు. గురువారం విద్యార్థులను ఆమె అభినందించారు. ఈ సందర్భంగా హెచ్‌ఎం మాట్లాడుతూ ఈనెల 14న బాలల దినోత్సవం సందర్భంగా తెలంగాణ సారస్వత పరిషత్ నిర్వహించిన కథల పోటీలో తమ పాఠశాల 8వ తరగతి విద్యార్థి ఉషారాణి రాసిన ‘వర్ష’ కథకు బహుమతి లభించిందన్నారు. నిర్వాహకులు రూ.500 నగదు బహుమతితోపాటు, జ్ఞాపిక, ప్రశంసా పత్రం, రూ.500 విలువ చేసే పుస్తకాలను అందజేసినట్లు తెలిపారు. చిత్రలేఖనం పోటీలో 6వ తరగతి విద్యార్థి పరశురాముడు ప్రతిభ కనబరిచి జ్ఞాపిక, ప్రశంసా పత్రం రూ.500 విలువ చేసే పుస్తకాలను దక్కించుకున్నాడన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు ప్రసాదు, షాహిదా, ఎలిజిబెత్ రాణి, రమాదేవి, కుసుమకుమారి, సూర్యనారాయణ, శాంతికుమారి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment