భూ రీసర్వేను వేగవంతం చేయాలి
కోడుమూరు రూరల్: భూ రీసర్వేను వేగవంతం చేయాలని రెవెన్యూ సిబ్బందిని జాయింట్ కలెక్టర్ నవ్య ఆదేశించారు. బుధవారం మండలంలోని ఎర్రదొడ్డిలో జరుగుతున్న భూ రీసర్వేను జాయింట్ కలెక్టర్ నవ్య, ట్రైనీ కలెక్టర్ చల్ల కళ్యాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులు, రెవెన్యూ సిబ్బందితో మాట్లాడారు. భూరీసర్వే కార్యక్రమంలో చాలా నిదానంగా ఉందని, వేగవంతం చేయాలని తహసీల్దార్ వెంకటేష్ నాయక్, మండల సర్వేయర్ సునీల్ కుమార్‌ను జేసీ ఆదేశించారు. ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో సర్వే ఏడీ మునికన్నన్, వీఆర్వోలు, సర్వేయర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment