పెళ్లీడు వచ్చిన తర్వాతే వివాహం చేయాలి
కర్నూలు(హాస్పిటల్): అమ్మాయిలకు పెళ్లీడు (18 ఏళ్లు) వచ్చిన తర్వాతే వివాహం చేయాలని జిల్లా మాస్ మీడియా అధికారి శ్రీనివాసులు శెట్టి అన్నా రు. బుధవారం డాక్టర్స్ కాలనీలోని యూపీహెచ్‌సీలో జరుగుతున్న టీకాల కార్యక్రమాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గర్భిణి, పిల్లలు వ్యాధుల బారిన పడకుండా వ్యాధినిరోధక టీకాలు రక్షణ కల్పిస్తాయన్నారు. వీటి వల్ల భవిష్యత్‌లో పిల్లలు ప్రాణాంతక వ్యాధుల బారి నుంచి రక్షణ కలుగుతుందని చెప్పారు. అమ్మాయిలకు 18 ఏళ్లు, అబ్బాయిలకు 21 ఏళ్లు వచ్చిన తర్వాత మాత్రమే వివాహాలు చేయాలన్నారు. టీనేజీలో గర్భధారణ వల్ల గర్భస్రావం, మృతశిశువు జననం, బరువు తక్కువ పిల్లలు జన్మించడం, తల్లికి తీవ్ర రక్తహీనత వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ డెమో చంద్రశేఖర్‌రెడ్డి, ఆరోగ్య విద్యాబోధకురాలు పద్మావతి, ఆరోగ్య కార్యకర్తలు నిర్మలాబాయి, మయూరి, ఆశా కార్యకర్త ఉమా మహేశ్వరి పాల్గొన్నారు.
శ్రీమఠం హుండీ ఆదాయం రూ.3.29 కోట్లు
మంత్రాలయం: మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి శ్రీమఠం హుండీ ఆదాయం రూ. 3.29 కోట్లు లభించిందని మఠం అధికారులు తెలిపా రు. గత 23 రోజులకు సంబంధించి భక్తులు సమ ర్పించిన కానుకలు లెక్కించగా రూ.3,21,05,005 నగదు, రూ.8,10,100 నాణేలు, 58.150 గ్రాము ల బంగారు బంగారం, 1,280 గ్రాముల వెండి వచ్చినట్లు తెలిపారు.
నేడు జెడ్పీ స్థాయీసంఘ సమావేశాలు
కర్నూలు(అర్బన్): జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి ఉత్తర్వుల మేరకు గురువారం ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలను నిర్వహిస్తున్నట్లు జెడ్పీ సీఈఓ జీ నాసరరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జెడ్పీలోని మినీ సమావేశ భవనంలో నిర్వహించే ఈ సమా వేశాల్లో గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, సాంఘి క సంక్షేమం, విద్య, వైద్యం, మహిళాభివృద్ధి – శిశు సంక్షేమం, పనులు – ఆర్థిక ప్రణాళిక తదితర శాఖలకు సంబంధించిన అంశాలపై సమీక్ష చేస్తారన్నారు. ఈ నేపథ్యంలోనే వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన కర్నూలు, నంద్యాల జిల్లాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, అధికారులు, జెడ్పీటీసీ సభ్యులు తమకు కేటాయించిన సమయానికి ఆయా స్థాయీ సంఘ సమావేశాలకు హాజరు కావాలని సీఈఓ కోరారు.
సబ్ డివిజన్ పిటిషన్లను త్వరగా పరిష్కరించండి
కర్నూలు(సెంట్రల్): రీసర్వే జరిగిన గ్రామాల్లో సబ్ డివిజన్, ఎఫ్‌లైన్లకు సంబంధించిన పిటిషన్లను త్వరగా పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సీసీఎల్‌ఏ కమిషనర్ జయలక్ష్మీ కలెక్టర్‌ను ఆదేశించారు. బుధవారం విజయవాడ నుంచి ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రీసర్వేపై కలెక్టర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..పైలట్ ప్రాజెక్టు కింద రీసర్వే జరుగుతున్న గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న బ్లాక్ బౌండరీలను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పి.రంజిత్‌బాషా, జేసీ డాక్టర్ బి.నవ్య, డీఆర్వో సి.వెంకట నారాయణమ్మ, సర్వే ఏడీ మునికన్నన్ పాల్గొన్నారు.
కృష్ణమ్మను వీడుతున్న సంగమేశ్వరుడు
కొత్తపల్లి: ప్రాచీన సంగమేశ్వరాలయం మరి కొద్ది రోజుల్లో పూర్తిగా జలాధివాసం వీడనుంది. గతేడాది జూలై నెల చివర్లో ఈ ఆలయం కృష్ణాజలాల్లో మునిగింది. ప్రస్తుతం శ్రీశైల జలాశయం నీటిమట్టం తగ్గుతుండటంతో ఏడు నెలల పాటు జాలాధివాసంలో ఉన్న ఈ ఆలయ గోపురాలు బయటపడ్డాయి. బుధవారం నాటికి శ్రీశైలం డ్యామ్‌లో నీటి మట్టం 850 అడుగులకు చేరడంతో ప్రాచీన ఆలయం ప్రహరీ బయట పడింది.
పెళ్లీడు వచ్చిన తర్వాతే వివాహం చేయాలి
పెళ్లీడు వచ్చిన తర్వాతే వివాహం చేయాలి
Comments
Please login to add a commentAdd a comment