ప్రతి రోజూ 20 ఎకరాల్లో ‘భూసర్వే’
మద్దికెర: ప్రతి రోజు 20 ఎకరాల్లో భూసర్వే పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ బి.నవ్య ఆదేశించారు. మండల పరిధిలోని పెరవలి గ్రామ పరిసరాల్లో జరుగుతున్న భూసర్వే కార్యక్రమాన్ని గురువారం ఆమె పరిశీలించారు. రైతుల పట్టాదారు పాసు పుస్తకాలను పరిశీలించి భూమి కొలతల ప్రకారం సర్వే చేయించి రికార్డుల్లో నమోదు చేయాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. అనంతరం మండల పరిధిలోని బొమ్మనపల్లి గ్రామంలోని అసైన్డ్‌భూములను పరిశీలించారు. పత్తికొండ ఆర్డీఓ భరత్‌నాయక్, తహసీల్దార్ హుస్సేన్‌సాహెబ్, ఆర్‌ఐ రవికుమార్, వీఆర్వో రంగస్వామి పాల్గొన్నారు.
పట్టుపరిశ్రమ సహాయకులకు త్వరలో పదోన్నతి
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా పట్టు పరిశ్రమ శాఖలో పని చేస్తున్న గ్రామ పట్టుపరిశ్రమ సహాయకుల(వీఎస్‌ఏ)కు పదోన్నతి లభించనుంది. ఉమ్మడి జిల్లాలో 11 మంది వీఎస్‌ఏలు పనిచేస్తున్నారు. వీరికి సాంకేతిక సహాయకులు(టీఏ)గా పదోన్నతి కల్పించనున్నారు. ఇప్పటి వరకు వీరు సచివాలయ ఉద్యోగులుగా పని చేస్తున్నారు. పదోన్నతులు పొందడం ద్వారా వీరు పట్టుపరిశ్రమ శాఖ పరిధిలోకి వస్తారు. పదోన్నతులకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే జీఓ జారీ చేసింది. పదోన్నతులకు సంబంధించిన ఫైలు జేసీకి పంపారు. అక్కడి ఆమోదం పొందిన తర్వాత కర్నూలు, నంద్యాల జిల్లాల పట్టు పరిశ్రమ శాఖ అధికారులు పోస్టింగ్‌లు ఇస్తారని అధికార వర్గాలు తెలిపాయి.
అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు
కర్నూలు న్యూసిటీ/రూరల్: జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీల పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నారు. గురువారం కర్నూలు ఆర్‌డీఒ కార్యాలయంలో కమిటీ సభ్యులు ఆర్‌డీఓ కె.సందీప్‌కుమార్, ఐసీడీఎస్ పీడీ నిర్మల, అడిషనల్ డీఎంహెచ్‌ఓ, సీడీపీఓ వరలక్ష్మి ఇంటర్వ్యూలు నిర్వహించారు. కర్నూలు రూరల్, కోడుమూరు, వెల్దుర్తి మండలాల పరిధిలోని ఐదు అంగన్‌వాడీ కార్యకర్తల పోస్టులు ఖాళీ ఉండగా 12 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందు లో 11 మంది ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. 40 అంగన్‌వాడీ ఆయా పోస్టులకు 200 మంది దరఖాస్తు చేసుకోగా ఇంటర్వ్యూలకు 163 మంది హాజరైనట్లు ఐసీడీఎస్ పీడీ నిర్మల తెలిపారు.
రేపు ఆదోని, 4న పత్తికొండ డివిజన్లలో..
ఆదోని పరిధిలో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయా ల పోస్టుల భర్తీకి శనివారం ఇంటర్వ్యూలు నిర్వ హించనున్నారు. అలాగే పత్తికొండ డివిజన్‌లో 4 టీచర్ పోస్టులకు, 26 ఆయా పోస్టులకు వచ్చేనెల 4న ఇంటర్వ్యూలు జరపనున్నారు.
ప్రతి రోజూ 20 ఎకరాల్లో ‘భూసర్వే’
Comments
Please login to add a commentAdd a comment