పరీక్ష కేంద్రాల సమీపంలో జిరాక్స్‌ కేంద్రాలు మూసివేయాలి | - | Sakshi
Sakshi News home page

పరీక్ష కేంద్రాల సమీపంలో జిరాక్స్‌ కేంద్రాలు మూసివేయాలి

Published Fri, Feb 28 2025 1:47 AM | Last Updated on Fri, Feb 28 2025 1:47 AM

-

కర్నూలు(అర్బన్‌): ఇంటర్‌ పరీక్ష కేంద్రాల సమీపంలో ఉన్న ఇంటర్నెట్‌, జిరాక్స్‌ కేంద్రాలను మూసివేయాలని కార్మికశాఖ ఉప కమిషనర్‌ కే వెంకటేశ్వర్లు ఆదేశించారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు ఇంటర్‌ పరీక్షలు నిర్వహించనున్నారని పేర్కొన్నారు. పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతున్నందున, ఆ సమయంలో పరీక్ష కేంద్రాల సమీపంలోని జిరాక్స్‌, నెట్‌ కేంద్రాలను మూసి వేయాలని తెలిపారు. అలా చేయని కేంద్రాలపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement