నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ!
కర్నూలు కల్చరల్: ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలు మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు జరగనున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష ఉండటంతో కేంద్రాలకు గంట ముందుగానే చేరుకోవాలి. నిర్దేశించిన సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. పరీక్షల నిర్వహణ, ఏర్పాట్లు, వసతుల కల్పన తదితర విషయాలను ఆర్‌ఐఓ గురవ్య శెట్టి గురువారం విలేకరులకు వివరించారు. పరీక్ష కేంద్రాల్లో తాగునీటి వసతి, వైద్య సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. విద్యార్థులందరూ బెంచీలపై కూర్చొని పరీక్షలు రాసేందుకు బెంచీలు ఏర్పాటు చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా 69 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయన్నారు. మొదటి సంవత్సరం 23, 098 మంది, ద్వితీయ సంవత్సరం 22, 227 మంది మొత్తం 45,325 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. కర్నూలు జిల్లాలో చిప్పగిరి, కోసిగి, పత్తికొండ, దేవనకొండ, కృష్ణగిరి, గోనెగండ్ల, ఆలూరు జూనియర్ కళాశాలల్లోని 7 కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. వీటిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. హాల్ టికెట్‌పై కాలేజ్ ప్రిన్సిపాల్ సంతకం లేకపోయినా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఏమైనా సమస్యలు ఉంటే కంట్రోల్ రూం ఫోన్ 08518 222047 నంబర్‌ను సంప్రదించవచ్చు. విలేకరుల సమావేశంలో స్పెషల్ ఆఫీసర్ జి.లాలెప్ప, డీఈసీ మెంబర్లు కె.నాగభూషణ్ రెడ్డి, యు.పద్మావతి, జీఎస్ సురేష్ చంద్ర, డిస్ట్రిక్ట్ బల్క్ ఇన్‌చార్జ్ కె. రమాదేవి పాల్గొన్నారు.
రేపటి నుంచి ఇంటర్మీడియెట్
పబ్లిక్ పరీక్షలు
Comments
Please login to add a commentAdd a comment