ఆతిథ్య సేవలకు రేటింగ్
కర్నూలు(సెంట్రల్): ప్రభుత్వ నిబంధనల మేరకు పర్యాటక ఆతిథ్యాలకు స్వచ్ఛత గ్రీన్ లీఫ్ రేటింగ్ (ఎస్‌జీఎల్‌ఆర్) ఇవ్వాలని కలెక్టర్ పి.రంజిత్‌బాషా అధికారులను ఆదేశించారు. పర్యాటకులకు అసౌకర్యం కలగకుండా ఎస్‌జీఎల్‌ఆర్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఆయన బుధవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో పర్యాటకులకు సౌకర్యాలు కల్పిస్తున్న హోటళ్లు, రెస్టారెంట్లు, హోమ్‌స్టేలు, ధర్మశాలలు, లాడ్జీలకు రేటింగ్‌ను ప్రకటించాలన్నారు. టాయిలెట్ సదుపాయాలు, తడి, పొడిచెత్తను వేరుచేసే విధానాలను పరిశీలించి రేటింగ్ ఇవ్వాలన్నారు. మునిసిపల్ కమిషనర్లు, డీపీఓలు ఈ అంశంపై దృష్టి సారించాలని సూచించారు. అలాగే ఆతిథ్య సంస్థలకు జిల్లా, డివిజనల్ స్థాయిల్లో వర్కుషాపులు నిర్వహించాలని ఆర్‌డబ్ల్యూఎస్, టూరిజం, పంచాయతీ, అధికారులను ఆదేశించారు. దీనిపై మార్చి 31లోపు నివేదిక సమర్పించాలని ఆదోని సబ్‌కలెక్టర్ మౌర్య భరద్వాజ్, కర్నూలు, పత్తికొండ ఆర్‌డీఓలను ఆదేశించారు. జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ నాగేశ్వరరావు, జిల్లా పర్యాటక శాఖ అధికారి విజయ, డీపీఓ భాస్కర్, ఏపీ టూరిజం కార్పొరేషన్ డిప్యూటీ మేనేజర్ సువర్ణ పాల్గొన్నారు.
ఆతిథ్య సేవలకు రేటింగ్
Comments
Please login to add a commentAdd a comment