సారా తయారీ మానుకుంటే ‘నవోదయం’
వెల్దుర్తి: బతుకుదెరువు కోసమని సారా తయారు చేస్తూ చివరకు పోలీసు స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరగడంతోనే బతుకులను నాశనం చేసుకుంటున్నారని, తయారీ మానుకుంటేనే జీవితాల్లో నవోదయం వస్తుందని ఎకై ్సజ్ శాఖ ఉమ్మడి జిల్లా డిప్యూటీ కమిషనర్ పోతుల శ్రీదేవి అన్నారు. బుధవారం ఆమె మండలంలోని ఎల్.నగరం తండాలో అసిస్టెంట్ కమిషనర్ రావిపాటి హనుమంతరావు, సూపరింటెండెంట్ సుధీర్ బాబుతో కలిసి నవోదయం కార్యక్రమం నిర్వహించారు. అధికారులు గ్రామస్తులతో మమేకమై, వారి కుటుంబాలతో కలిసి మాట్లాడుతూ సారా తయారీ మానుకునే వారికి జీవనాధారం కల్పిస్తామని హామీ ఇచ్చారు. మానుకోకపోతే పీడీ యాక్టు నమోదుకు సైతం వెనుకాడబోమని హెచ్చరించారు. నాటు సారా తయారీ, అమ్మకం, తాగడం ద్వారా జరిగే అనర్థాలను గ్రామస్తులకు వివరించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు దాదిపోగు సుంకన్న, ఏఈఎస్ రాజశేఖర్ గౌడ్, ఈఎస్‌టీఎఫ్ ఇన్స్‌పెక్టర్ రాజేంద్రప్రసాద్, కోడుమూరు ఎకై ్సజ్ సీఐ మంజుల, ఎస్‌ఐ చంద్రమోహన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment