నాటుసారా నిర్మూలనే నవోదయం 2.0 లక్ష్యం
కర్నూలు: నాటుసారా నిర్మూలనే నవోదయం 2.0 లక్ష్యమని కర్నూలు ఎకై ్సజ్ సూపరింటెండెంట్ సుధీర్ బాబు అన్నారు. జిల్లాలో 110 నాటుసారా ప్రభావిత గ్రామాలు ఉండగా.. ఆయా గ్రామాల్లో నాటుసారా నిర్మూలనలో ప్రజలను భాగస్వాములను చేయాలనే ఉద్దేశంతో ఎకై ్సజ్ శాఖ ప్రచార రథాన్ని ప్రారంభించింది. స్థానిక కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం సుధీర్ బాబు ప్రచార రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు. సారా వినియోగం వల్ల కలిగే అనర్థాలు, మానుకుంటే కలిగే ప్రయోజనాలను వివరిస్తూ గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ ప్రచార రథాన్ని ప్రారంభించినట్లు సుధీర్ బాబు తెలిపారు. కర్నూలు పట్టణంలోని సారా ప్రభావిత ప్రాంతాలైన బంగారుపేట, బుధవారపేటలో సాయంత్రం ప్రచార రథం కలియతిరిగింది. కార్యక్రమంలో ఏఈఎస్‌లు రాజశేఖర్ గౌడ్, రామకృష్ణారెడ్డి, సీఐలు చంద్రహాస్, జయరాం నాయుడు, రాజేంద్రప్రసాద్, ఎస్‌ఐ దుర్గానవీన్ బాబు, ఎకై ్సజ్ సిబ్బంది పాల్గొన్నారు.
● ఎకై ్సజ్ సూపరింటెండెంట్ సుధీర్ బాబు
Comments
Please login to add a commentAdd a comment