డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
కర్నూలు: నగరంలోని ఓ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. కల్లూరు మండలం దేవేంద్ర నగర్‌లో నివాసముంటున్న అనురాధ, సుదర్శన్ యాదవ్ దంపతులకు ఇద్దరు కూతుర్లు, కొడుకు సంతానం. చిన్నకూతురు సుప్రియ (19) కర్నూలుకు చెందిన కరీంను ప్రేమించింది. ఈ విషయం తెలిసి ఆమె తండ్రి మదనపడుతుండేవాడు. చివరకు పెళ్లికి అంగీకరించినప్పటికీ తన ప్రేమ విషయంలో తండ్రి మదన పడుతున్న విషయాన్ని గ్రహించి సుప్రియ తీవ్ర మనస్తాంతో ఈనెల 8వ తేదీన పురుగు మందు తాగి అపస్మారక స్థితిలో పడిపోయింది. కుటుంబ సభ్యులు గుర్తించి ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స చేయించారు. తర్వాత మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ కోలుకోలేక శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందింది. ఈ మేరకు మృతురాలి తల్లి అనురాధ నాల్గవ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment