ఆన్‌లైన్ లావాదేవీల కారణంగా బ్యాంకు ఖాతా ఖాళీ అయ్యేవరకు మనం ఎంత ఖర్చు పెట్టామో తెలియని పరిస్థితి. దీనికితోడు ఏ వస్తువును ఎంతకు కొనుగోలు చేస్తున్నారో కూడా తెలియకుండా, బేరమాడకుండా కొనేస్తున్నారు. సాధారణంగా మనం కిరాణా దుకాణానికి వెళ్తే సరుకులకు దేనికి ఎంత బిల్లు వేశాడో చూస్తాము. కానీ డిజిటల్ పేమెంట్స్ కారణంగా ఇవేమీ పట్టించుకోవడం లేదు. షాపువారు ఎంత చెబితే అంత చెల్లించి వచ్చేస్తున్నారు. దీనివల్ల డబ్బు విలువ చాలా మందికి తెలియకుండా పోతోంది. ముఖ్యంగా ఈ తరం యువతకు అస్సలు తెలియడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.