విత్తనాల డీలర్లకు లైసెన్స్ తప్పనిసరి
కర్నూలు(అగ్రికల్చర్): విత్తనాల డీలర్లకు తప్పనిసరిగా లైసెన్స్ ఉండాలని, ఎరువులు, పురుగుమందులు కూడా లైసెన్స్‌తోనే విక్రయించాలని రాష్ట్ర వ్యవసాయ అధికారుల సంఘం జనరల్ సెక్రటరీ డాక్టర్ ప్రవీణ్ అన్నారు. వ్యవసాయ శాఖ రూపొందించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఫర్టిలైజర్ దుకాణాలు నిర్వహించుకోవాలని సూచించారు. కర్నూలు, పత్తికొండ సబ్ డివిజన్‌లోని మండలాలతో పాటు గోనెగండ్ల మండలాలకు చెందిన డీలర్లకు జిల్లా వ్యవసాయ అధికారుల సంఘం నాయకులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రవీణ్ మాట్లాడుతూ...ప్రతి డీలరు లైసెన్స్ కాపీలను దుకాణంలో అందరికి కనిపించే విధంగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి మాట్లాడుతూ.. ఎరువులు, విత్తనాలకు కొంతమంది కృత్రిమ కొరత సృష్టిస్తుంటారని, ఇది మంచిది కాదన్నారు. ఈ సందర్బంగా డీలర్లకు ఉపయోగపడే విధంగా కరదీపిక బుక్‌లెట్‌ను విడుదల చేశారు. జిల్లా వ్యవసాయ అధికారుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు విశ్వనాథ్, దస్తగిరిరెడ్డి, ఆత్మ డీపీడీ శ్రీలత, ఏడీఏలు సాలురెడ్డి, మహమ్మద్ ఖాద్రీ, మోహన్‌విజయ్, అరుణకుమారి, తెలుగు రాష్ట్రాల సీడ్‌మెన్ అసోషియేషన్ అధ్యక్షుడు మురళీధర్‌రెడ్డి, ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల డీలర్ల సంక్షేమ సంఘం నేతలు అశోకానందరెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారుల సంఘం నేతలు రామకృష్ణ, మధుమతి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment