శ్రీశైలానికి వెళ్తుండగా ప్రమాదం
కోడుమూరు రూరల్: కర్ణాటక రాష్ట్రంనుంచి శ్రీశైలానికి వెళ్తున్న కారును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు వ్యక్తులు గాయపడ్డారు. దుర్ఘటన ఆదివారం కోడుమూరు–కర్నూలు రోడ్డులో ప్యాలకుర్తి వద్ద చోటు చేసుకుంది. కర్ణాటక రాష్ట్రం దావణగేరి జిల్లా నరసగండ్ల హల్లి గ్రామానికి చెందిన మురుగేంద్రయ్య, పద్మావతి, గౌరమ్మలతో పాటు మరో నలుగురు వ్యక్తులు కలిసి శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు బయలుదేరారు. కోడుమూరు దాటిన తర్వాత ప్యాలకుర్తి వద్ద కారును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో మురుగేంద్రయ్య, పద్మావతి, గౌరమ్మలకు రక్తగాయలవ్వగా, మిగిలిన నలుగురు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం కోడుమూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కోడుమూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కారును ఢీకొన్న లారీ.. ఏడుగురికి గాయాలు
Comments
Please login to add a commentAdd a comment