హొళగుంద: పదో తరగతి పరీక్షల్లో భాగంగా మొదటి రోజు హొళగుంద జెడ్పీ హైస్కూల్‌లో డెస్క్‌ల సమస్య వచ్చిందని, సమస్య పరిష్కారమైందని డీఈఓ శామ్యూల్ పాల్ తెలిపారు. హొళగుందలోని పరీక్ష కేంద్రాలను సోమ వారం ఆయన తనిఖీ చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాటాడుతూ.. జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా సాగుతున్నాయన్నారు. డీఈఓ వెంట ఎంఈఓ–1, 2 సత్యనారాయణ, జగన్నాథం ఉన్నారు.
ఏపీపీఎస్‌సీ పరీక్షలకు
పకడ్బందీ ఏర్పాట్లు
కర్నూలు(సెంట్రల్): ఏపీపీఎస్‌సీ ఆన్‌లైన్ పరీక్షలు మార్చి 25, 26,27 తేదీల్లో జరగనున్నాయని, పడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను జేసీ డాక్టర్ బి.నవ్య ఆదేశించారు. పరీక్షలపై కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌హాలులో సోమవారం ఆమె సమీక్షించారు. కర్నూలులో ని డిజిటల్ అయాన్‌లో 25, 26 తేదీల్లో అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంట్ ఇంజినీర్ నియామక పరీక్షలు, ఎమ్మిగనూరులోనిసెయింట్ జోసెఫ్ డిగ్రీకళాశాలలో గ్రేడు–2 అనలిస్టు నియామక పరీక్షలు జరుగుతాయన్నారు. కర్నూలులోని ఆయాన్ డిజిటల్‌లో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టు కోసం 27న ఆన్‌లైన్ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. కలెక్టరేట్ ఏఓ విజయశ్రీ, ఏపీపీఎస్‌సీ సెక్షన్ ఆఫీసర్ ఢిల్లేశ్వరరావు పాల్గొన్నారు.
‘సిల్వర్‌జూబ్లీ’లో
జాతీయ సదస్సు
కర్నూలు సిటీ: సిల్వర్‌జూబ్లీ డిగ్రీ కాలేజీలో సోమవారం జాతీయ సదస్సు ప్రారంభమైంది. ప్రిన్సిపాల్ డాక్టర్ వీవీఎస్ కుమార్ అధ్యక్షత వహించారు. రెండు రోజుల పాటు ఈ సదస్సును నిర్వహించనున్నారు. క్లస్టర్ వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ కే వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ఉద్యోగ అవకాశాలు అనే అంశంపై నిర్వహించిన సదస్సులో పలువురు మాట్లాడారు. సదస్సుకు 130 పత్రాలు వచ్చాయి. ప్రొఫెసర్లు డాక్టర్ ఎల్లా కృష్ణ, శ్రీనివాసమూర్తి, జి.చంద్రశేఖర్, సిల్వర్‌జూబ్లీ కాలేజీ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ బీఆర్ ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు.
డెస్క్‌ల సమస్య పరిష్కారం