అమ్మ బోయ లక్ష్మి, నాన్న రామన్నకు వ్యవసాయమే జీవనాధారం. నేను మోడల్ స్కూల్‌లో 2021 – 2023 మధ్య ఇంటర్ ఎంఈసీ పూర్తి చేశాను. ప్రస్తుతం గుంతకల్లులోని బీసీ హాస్టల్‌లో ఉంటూ ఎస్‌కేపీ డిగ్రీ కాలేజీలో బీకాం రెండో సంవత్సరం చదువుతున్నాను. ప్రతి రోజు ఉదయం పరుగు, షాట్ పుట్ సాధన చేసేవాడిని. ఆర్మీకి ఎంపిక కావడం సంతోషంగా ఉంది. ట్రైనింగ్ నిమిత్తం ఈనెల 26న బెంగళూరుకు వెళ్తున్నా.
– మహీంద్రా, చిన్నహోతూరు గ్రామం,
ఆస్పరి మండలం