బీసీల హక్కులను కాలరాస్తున్న పాలకులు
కర్నూలు(అర్బన్): పాలక పార్టీలు బీసీల హక్కులను కాలరాస్తున్నాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం స్థానిక బీ క్యాంప్‌లోని బీసీ భవన్‌లో జిల్లా అధ్యక్షుడు మురళీమోహన్ అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు వై నాగేశ్వరరావుయాదవ్, ప్రధాన కార్యదర్శి టీ మద్దులేటి, ప్రచార కార్యదర్శి ఎం. రాంబాబు, వైఎస్సార్‌పీపీ మహిళా విభాగం రాష్ట్ర నాయకురాలు భారతి, ఉపాధక్షులు గ్యాస్ శ్రీనివాసులు, రజక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాడాల నాగరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా నక్కలమిట్ట శ్రీనివాసులు మాట్లాడుతూ.. బీసీ కులగణన చేపట్టి జనాభా నిష్పత్తి మేరకు చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలన్నారు. చట్టసభల్లో బీసీ రిజర్వేషన్లకై ఉద్యమాలను చేపడుతామన్నారు. దేశంలో, రాష్ట్రంలో బీసీల ప్రయోజనాలను దెబ్బతీస్తూ వారి హక్కులను కూడా హరిస్తున్నారన్నారు. కార్యక్రమంలో గొర్రెల పెంపకందారుల సంఘం చైర్మన్ శ్రీనివాసులు, పలు బీసీ కుల సంఘాల నాయకులు నాగేంద్రయాదవ్, శకుంతల, ఉప్పరి శివన్న, ధర్మ, పీజీ వెంకటేష్, సాయి తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కమిటీలో పలువురికి చోటు ...
ఈ నేపథ్యంలోనే బీసీ సంక్షేమ సంఘం జిల్లా కమిటీలో పలువురికి స్థానం కల్పించి నియామక పత్రాలను అందించారు. సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా కుమ్మరి రామక్రిష్ణ, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలిగా కుమ్మరి రాజేశ్వరి, కార్యదర్శిగా కే శ్రీనివాసులు, కోశాధికారిగా కే బజారన్న, కే గిరిబాబు, సహాయ కార్యదర్శిగా ఎం రవికుమార్, ఆర్గనైజింగ్ సెక్రెటరీగా ఏ నాగార్జున, జిల్లా కమిటీ ఉపాధ్యక్షులుగా బీ రాధ, కార్యదర్శిగా సీ రేణుక, కే లింగన్నను నియమించారు.
Comments
Please login to add a commentAdd a comment