పేలిన వంట గ్యాస్.. ముగ్గురికి గాయాలు
ఆలూరు రూరల్: వంట గ్యాస్ లీకై సిలిండర్ పేలడంతో ముగ్గురు గాయపడ్డారు. ఇందులో గురుస్వామి, ధర్మ అనే బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. మండలంలోని కురువళ్లి గ్రామంలో ఆదివారం తెల్లవారు జామున ప్రమాదం జరిగింది. ఎస్‌ఐ మహబూబ్ బాషా తెలిపిన వివరాలు.. కురువళ్లి గ్రామానికి చెందిన గురుస్వామి తన భార్య గాయత్రి, కుమరుడు ధర్మతో కలిసి ఇంట్లో నిద్రపోయారు. ఆదివారం తెల్లవారు జామున చుట్టుపక్కల వారు.. గ్యాస్ లీకై న వాసన వస్తోందని గురుస్వామికి చెప్పారు. ఆయన లైట్ ఆన్ చేయగానే ఒక్క సారిగా లీకై న గ్యాస్ మంటలు చెలరేగి పెద్ద శబ్దం వచ్చింది. ప్రమాదంలో గురుస్వామి, కుమారుడు ధర్మ తీవ్రంగా గాయపడ్డారు. గాయత్రికి స్వల్పగాయాలయ్యాయి. ఇల్లు ధ్వంసమైంది. క్షతగాత్రులను ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆదోని ఆసుపత్రికి రెఫర్ చేశారు. ప్రస్తుతం గాయపడిన తండ్రి, కొడుకు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయత్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
గాయపడిన వీరిలో ఇద్దరి పరిస్థితి విషమం
Comments
Please login to add a commentAdd a comment