● జిల్లా వ్యవసాయ అధికారి వైవి మురళీకృష్ణ
కొత్తపల్లి: ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో పండించిన ఉత్పత్తులకు అధిక డిమాండ్ ఉంటుందని జిల్లా వ్యవసాయాధికారి వైవీ మురళీకృష్ణ తెలిపారు. మండల పరిధిలోని పాలెంచెరువు గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ జి.నరేంద్రారెడ్డి, ఏడీఏ ఆంజనేయలు, జెడ్పీటీసీ సోమల సుధాకర్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు ప్రకృతి వ్యవసాయంపై మొగ్గు చూపాలన్నారు. పంటమార్పిడి పద్ధతిని అవలంబించాలన్నారు. రైతు సేవ కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకుని మినుములు, శనగలను మద్దతు ధరకు విక్రయించుకోవాలన్నారు. నీటి వసతి ఉన్న రైతులు వేసవిలో పప్పు జాతి పంటలను సాగుచేసుకోవాలని, తద్వారా నేలకోత తగ్గడంతో పాటు భూ సారం పెరుగుతుందన్నారు. అనంతరం ప్రకృతి వ్యవసాయం ద్వారా సాగు చేసిన పొలాలను పరిశీలించా రు. ప్రకృతి వ్యవసాయ సిబ్బందితో విత్తన గుళికల త యారీ విధానం, పొలంలో వెదజల్లే తీరును రైతులకు చూపించారు. కార్యక్రమంలో సర్పంచ్ మశమ్మ, ఏఓ మహేష్, ఉద్యాన శాఖ అధికారి చందన పాల్గొన్నారు.