
రామ ఫలం ఎంతో రుచి..
సీతా ఫలం తిన్నాము కానీ... రామ ఫలం ఎప్పుడూ చూడలేదు.. తినలేదు అనుకుంటున్నారా.. అవును ఇది మన ప్రాంతంలో పండదు. ఉత్తరాంధ్ర, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లో లభిస్తాయి. అయితే తినాలనుకంటే సూపర్ మార్కెట్లలో, ఆన్‌లైన్‌లో లభిస్తాయి. పేరుకు తగ్గట్టే ఈ పండులో ఎన్నో పోషకాలు ఉండి ఆరోగ్యాన్ని సంరక్షిస్తోంది. ముఖ్యంగా క్యాన్సర్‌ను నివారించే గుణాలు ఈ పండులో ఉన్నాయి. ఇప్పుడు ఈ పండు గురించి ప్రస్తావన ఎందుకంటే.. మండల కేంద్రమైన జూపాడుబంగ్లా శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయం సమీపంలో నివాసముంటున్న లక్ష్మీ నారాయణ అనే వ్యక్తి పన్నెండేళ్ల క్రితం రామఫలం మొక్కను నాటగా ఇది ఇప్పుడు పెరిగి కాయలు కాస్తోంది. వీటి తొడిమె గుండ్రంగా ఉండి పండు ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఎన్నో ఔషధగుణాలు ఉన్న రామఫలం వృక్షాన్ని ప్రతి ఇంటి పెరటిలో పెంచుకోవాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
– జూపాడుబంగ్లా

రామ ఫలం ఎంతో రుచి..