
అమ్మవారికి కొబ్బరికాయల సమర్పణ
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల శ్రీ భ్రమరాంబా దేవి అమ్మ వారికి మంగళవారం కొబ్బరి కాయలు సమర్పించారు. చైత్రమాసంలో పౌర్ణమి తరువాత వచ్చే మంగళ లేదా శుక్రవారం రోజున (ఏ రోజుముందుగా వస్తే ఆ రోజు) శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి కుంభోత్సవం జరపడం సంప్రదాయం. ఈ సంవత్సరం ఏప్రిల్ 15న ఈ కుంభోత్సవం నిర్వహించారు. ఈ అమ్మవారికి సాత్త్వికబలి నిర్వహించేందుకు (కొబ్బరికాయలు, గుమ్మడికాయలు, నిమ్మకాయలు, మొదలగునవి సమర్పించడం) ఈ కుంభోత్సవం జరిపించడం ఆనవాయితీ. కుంభోత్సవం రోజున సీ్త్ర వేషంలో ఉన్న పురుషుడు అమ్మవారికి కుంభహారతి సమర్పించడం ప్రధాన ఘట్టం. కాగా ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిసిన వెంటనే ప్రతి మంగళవారం మరియు శుక్రవారం రోజులలో అమ్మవారికి కొబ్బరికాయలను సమర్పించడం జరుగుతోంది. కార్యక్రమంలో ముందుగా అమ్మవారి ఆలయ ప్రదక్షిణ మండపంలో కొబ్బరికాయలను రాశిగా పోసి పసుపు, కుంకుమలతో వాటికి పూజలు జరిపించారు. తరువాత అమ్మవారికి ఈ కొబ్బరికాయలు సమర్పించారు.
డైట్ కళాశాలల్లో అధ్యాపకుల పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
నంద్యాల(న్యూటౌన్): ఉమ్మడి జిల్లాలోని డైట్ కళాశాలల్లో అధ్యాపకుల పోస్టులు భర్తీ చేసేందుకు ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ జనార్ధన్‌రెడ్డి మంగళవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ 10వ తేదీ వరకు గడువు ఉందన్నారు. 11న దరఖాస్తుల పరిశీలన, 16, 17 తేదీల్లో రాత పరీక్ష, 19న ఇంటర్వ్యూలు, ఎంపికై న వారికి 21న డిప్యూటేషన్ ఆర్డర్లు, 22న కేటాయించిన డైట్ కళాశాలలో చేరాలని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా, కన్వీనర్‌గా విద్యాశాఖ అధికారి, సభ్యులుగా డైట్ ప్రిన్సిపాళ్లు వ్యవహరిస్తారన్నారు. అర్హత ఉన్న వారు 55 శాతం మార్కులు, స్కూల్ అసిస్టెంట్‌గా కనీసం ఐదేళ్లు అనుభవం ఉండాలన్నారు. వయస్సు 58 సంవత్సరాల్లోపు ఉండాలన్నారు. మరింత సమాచారం కోసం డీఈఓ కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.