తెగ తాగేశారు! | - | Sakshi
Sakshi News home page

తెగ తాగేశారు!

Published Wed, Apr 2 2025 1:35 AM | Last Updated on Wed, Apr 2 2025 1:35 AM

తెగ త

తెగ తాగేశారు!

● పండుగల కిక్కు రెండు రోజుల్లో రూ.17 కోట్లు ● మద్యం విక్రయాల్లో రికార్డు బద్దలు ● 22,600 బాక్సుల మద్యం.. 12,400 బాక్సుల బీర్లు ఖాళీ ● ఎకై ్సజ్‌ అధికారులకు టార్గెట్లు విధించిన ప్రభుత్వం
రెండు రోజుల్లో మద్యం విక్రయాలు ఇలా...

కర్నూలు: కొత్త మద్యం పాలసీ... 24 గంటలూ అందుబాటులో మద్యం... ఆపై తెలుగు సంవత్సరాది ఉగాది.. మర్నాడు రంజాన్‌.. ఇంకేముంది మద్యం ప్రియులు మనసారా తాగేశారు, ఊగిపోయారు.. ఎంతగా అంటే రెండు రోజుల్లో ఏకంగా రూ.17.05 కోట్లు విలువైన మద్యం, బీర్లు తాగేశారు. ఇది జిల్లాలో సరికొత్త రికార్డు. ప్రజలకు దాహమేస్తే పాలకులు బిందెడు నీళ్లు ఇస్తున్నారో లేదో కానీ.. మద్యం ప్రియులు అడగకున్నా అర్ధరాత్రి వరకు మద్యాన్ని అందుబాటులో ఉంచిన కూటమి ప్రభుత్వం రూ.కోట్లు కొల్లగొట్టింది. జిల్లా చరిత్రలో కనివినీ ఎరుగని రీతిలో వరుసగా వచ్చిన రెండు పండుగల వేళ మద్యం విక్రయాల్లో రికార్డు బద్దలుకొట్టింది. ఒకటి, రెండు కాదు... ఏకంగా రూ.17.05 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి.

స్టేషన్ల వారీగా అధికారులకు టార్గెట్లు...

ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 ఎకై ్సజ్‌ పోలీస్‌ స్టేషన్లు ఉన్నాయి. ఈ ఏడాది ఉగాది పండుగ వేళ జరిగిన మద్యం విక్రయాలు గతంలో ఎప్పుడూ జరగనంతగా రికార్డు స్థాయిలో జరిగాయి. వారం రోజుల ముందు నుంచే స్టేషన్ల వారీగా మద్యం దుకాణాల సంఖ్యను బట్టి గతంలో జరిగిన విక్రయాలకు అదనంగా 30 శాతం పెంచాలని అధికారులకు ప్రభుత్వం లక్ష్యాలు (టార్గెట్‌) విధించింది. దీంతో స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్లు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకునేందుకు అధికారులు కూడా పరోక్షంగా బెల్టు దుకాణాదారులకు సహకారం అందిస్తున్నారనే ప్రచారముంది.

గోదాములు కిటకిట...

కూటమి ప్రభుత్వం ముందుగానే డిస్టిలరీల నుంచి భారీగా మద్యాన్ని డిపోలకు, అక్కడి నుంచి జిల్లాలోని 225 ప్రైవేటు మద్యం దుకాణాలు, 60 బార్లకు మద్యం తరలించారు. ఉమ్మడి జిల్లాలో రెండు ఐఎంఎల్‌ డిపోలు ఉన్నాయి. వాటి ద్వారా ఉగాది పండుగకు రెండు రోజుల ముందే రూ.20 కోట్ల విలువ చేసే మద్యం లిక్కర్‌ షాపులకు చేరింది. ఆ నిల్వలు సరిపోవని భావించిన ప్రభుత్వం పండుగ రోజుల్లో కూడా దుకాణాలకు అదనపు మద్యాన్ని తరలించేలా వ్యాపారులపై అధికారుల చేత ఒత్తిడి పెంచింది. ఈ సందర్భంగా జిల్లాలోని రెండు మద్యం డిపోలు కిటకిటలాడాయి. ఇందులో కర్నూలు డిపోలో రెండు రోజుల్లో సుమారు రూ.12 కోట్లు, నంద్యాల డిపోలో సుమారు రూ.10 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి.

ఇన్‌వాయిస్‌ ధరపై...

డిపోలనుంచి వ్యాపారులకు ఇన్‌వాయిస్‌ ధరపై మ ద్యం అందిస్తుండగా వాటికి తమ లాభ శాతం జోడించి ఎమ్మార్పీ ధరకు విక్రయించాల్సి ఉంది. ఉగాదికి రెండు రోజుల ముందు రూ.22 కోట్ల విలువ చేసే మద్యాన్ని వ్యాపారులు డిపోల నుంచి ఇన్‌వాయిస్‌ ధరపై కొనుగోలు చేసి విక్రయాలు జరిపారు. అదనపు ధరలకు బెల్టు షాపులకు కూడా విక్రయించి సొమ్ము చేసుకున్నారు. సాధారణ రోజుల్లో ఉమ్మడి జిల్లాలో సరాసరి రూ.4 నుంచి రూ.5 కోట్ల మేర అమ్మకాలు జరిగితే పండుగ సందర్భంగా మందుబాబులు రెట్టింపు స్థాయిలో తాగేశారు. అధికారులకు లక్ష్యాలు విధించడంతో రోజుకు అదనంగా రూ.3.50 కోట్ల అమ్మకాలు జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో కట్టడి...

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మద్యం అమ్మకాలను కట్టడి చేయగా కూటమి సర్కార్‌ వచ్చాక విచ్చలవిడిగా అందుబాటులోకి తెచ్చింది. ప్రతి 10 వేల మంది జనాభాకు ఓ మద్యం దుకాణం ఏర్పాటు చేసింది. అధికార పార్టీ నాయకుల ప్రోద్బలంతో ఊరూరా బెల్టు దుకాణాలు వెలిశాయి. దీంతో పండుగను పురస్కరించుకుని వ్యాపారులు మద్యాన్ని ఊరూవాడా ఏరులై పారించారు. జిల్లాలో టీడీపీ మద్యం సిండికేట్లకు డబ్బుల పంట పండింది. ప్రభుత్వ ఉద్దేశ్యం గుర్తించిన ఎకై ్సజ్‌ అధికారులు అర్ధరాత్రి వరకు మద్యం విక్రయాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.

జిల్లా మద్యం కేసులు బీరు కేసులు విలువ

కర్నూలు 10,677 6,451 రూ.8.24 కోట్లు

నంద్యాల 11,914 5,939 రూ.8.81 కోట్లు

మొత్తం 22,591 12,390 రూ.17.05 కోట్లు

తెగ తాగేశారు! 1
1/1

తెగ తాగేశారు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement