
నిత్య అతిథికి హారమై..
ఈ చిత్రాన్ని చూస్తుంటే సకల జీవరాశులు మనుగడకు కారణమైన సూర్య భగవానుడికి పక్షుల సమూహం హారమై నిలిచి వందనం చేస్తున్నట్లుగా ఉంది కదూ. సూర్యాస్తమయ సమయంలో నిత్య అతిథికి వీడ్కోలు పలుకుతూ ‘ఓ భానుడా మళ్లీ ఉదయించు’ అన్నట్లుగా వందల సంఖ్యలో పక్షులు తీగలపై నిలిచి కనిపించాయి. ఉదయం నుంచి ఆహారాన్వేషణలో అలసిన పక్షులు చీకటి పడుతున్న సమమంలో అన్నీ గూటికి చేరినట్లుగా విద్యుత్ తీగలపై వాలి సేద తీరాయి. కనువిందు చేసిన ఈ దృశ్యాలు మహానంది సమీపంలో మంగళవారం సాయంత్రం కనిపించాయి. – మహానంది

నిత్య అతిథికి హారమై..