
బాధను భరిస్తూ పరీక్షకు హాజరు
ప్యాపిలి: పట్టణానికి చెందిన షాకీర్ బాఫా, శాలిబీ దంపతుల కుమారుడు రియాజ్ బాషా స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో పదో తరగతి పరీక్షలు రాస్తున్నాడు. సోమవారం ఇంటి వద్ద ఆడుకుంటూ కిందపడ్డాడు. దీంతో అతని రెండు చేతులు విరిగాయి. వైద్యులు అతన్ని పరీక్షించి రెండు చేతులకు కట్లు కట్టారు. చేతులకు కట్లు కట్టడంతో మంగళవారం చివరి పరీక్ష (సోషల్) రాయలేని పరిస్థితి ఉండటంతో అధికారులు ఈ విషయాన్ని జిల్లా అధికారులకు తెలియజేశారు. రియాజ్ బాషా ప్రశ్నలకు సమాధానాలు చెప్పగా అధికారులు తొమ్మిదో తరగతి విద్యార్థితో పరీక్ష రాసే ఏర్పాటు చేశారు.
రెండు చేతులకు కట్లతో రియాజ్ బాషా