నైతిక విలువలకు ప్రాధాన్యం
కర్నూలు(సిటీ): రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు పాఠశాలల్లో నైతిక విలువలు, నాణ్యమైన విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఏపీ ప్రైవేట్ ఆన్ ఎయిడ్ స్కూల్స్ యాజమాన్య సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు వీ జనార్దన్‌రెడ్డి, గౌరవాధ్యక్షులు జీ పుల్లయ్య అన్నారు. ఆదివారం స్థానిక సెయింట్ జోసఫ్ డిగ్రీ కళాశాలలో నగరంలోని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రైవేట్ ఆన్ ఎయిడెడ్ పాఠశాలల గుర్తింపును 8 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలకు పెంచాలన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఇంటి స్థలాలను, ఆరోగ్యశ్రీ కార్డులను, ఇళ్లు నిర్మించుకునేందుకు తక్కువ వడ్డీతో రుణాలను ఇప్పించాలన్నారు. సమావేశంలో సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎస్ శ్రీనివాసరెడ్డి, జిల్లా గౌరవాధ్యక్షులు సీఆర్ షాహిదా, పట్టణ అధ్యక్షులు బీ యుగంధర్, కార్యదర్శులు కే శ్రీనివాస్, బీ మాధవక్రిష్ణతో పాటు జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన అధ్యక్ష, కార్యదర్శులు, కోశాధికారులు, స్కూళ్లకు అవసరమైన స్టాల్స్ స్టేషనరీ, యూనిఫామ్స్, లేబరెటరీ, సీసీ కెమెరాలు, కంప్యూటర్స్, ఎల్‌ఈడీ ప్యానల్స్, బోర్డ్స్, బుక్ పబ్లిషర్స్ పాల్గొన్నారు.
ఏపీ ప్రైవేట్ ఆన్ ఎయిడ్ స్కూల్స్
యాజమాన్య సంఘం నేతలు
Comments
Please login to add a commentAdd a comment